అఖిల్ అనగానే ఈసారైనా హిట్టు సినిమా కొట్టాలి అని పాజిటివ్ గా మాట్లాడుతారు తెలుగు ప్రేక్షకులు.కొన్నేళ్ల క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్టు మెట్టు ఎక్కాడు అఖిల్. అయితే ఆ తర్వాత ఏజెంట్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ దశలో అఖిల్ కొత్త చిత్రం కోసం టాలీవుడ్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. కొత్త సినిమా కబురు చెబుతాడు అనుకుంటే,ఎవరూ ఊహించని విధంగా, కొత్త ప్రేమకథను అందరి ముందుకు తీసుకొచ్చాడు. జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు.
టాలీవుడ్ కు అఖిల్ ఇలాంటి షాక్స్ ఇవ్వడం కొత్త కాకపోయినా, మరీ ఈ రెంజ్ షాక్ మాత్రం ఎవరూ ఊహించలేదు. ఢిల్లీకి చెందిన జైనబ్ తో రెండేళ్లుగా లవ్ లో ఉన్నాడట అఖిల్.ఆమె ఒక థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, ఇండియాతో పాటు లండన్ , దుబాయ్ లోనూ ఆర్టిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది జైనబ్. ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున మంచి స్నేహితులు అట. ఒక ఈవెంట్ లో అఖిల్ , జైనబ్ కు పరిచయం పెరిగి, ఆ తర్వాత ప్రేమగా మారిందని ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది వీరు ఇరువురు పెళ్లి పీటలెక్కనున్నారు. డెస్టినేషన్ మ్యారేజ్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.