మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారు అయినట్లే.. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి మధ్య చర్చలు మీద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేస్తారు,అలాగే షిండే ఉపముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కంటే కూడా హోం పైనే షిండే పట్టుబట్టి ఉన్నారనే వార్తల నేపథ్యంలో, కూటమి నేతల మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పరిస్థితులను పరిస్థితులను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను పరిశీలకులుగా భాజపా అధిష్టానం మహారాష్ట్రకు పంపింది.