ప్రైడ్ తెలుగు బిజినెస్ న్యూస్ – OnePlus 13 Series – స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్‌ వన్ ప్లస్ 13 సిరీస్ లాంఛ్ అయ్యాయి. ఈ ఫ్లాగ్ షిప్ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. వన్ ప్లస్ 13 తో పాటు వన్ ప్లస్ 13 ఆర్, స్మార్ట్ ఫోన్స్ ను కంపెనీ మరికొద్ది గంటల్లో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. వీటితో పాటు వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను కంపెనీ రిలీజ్ చేసింది. వీటి విలువ రూ. 11,999.

ఇక స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ లో వన్ ప్లస్ 13 , 12 జీబీ రామ్ ప్లస్ 256 ఇంటర్నల్ స్టోరేజీ వేరియెంట్ 69,999 వేలు. 16 జీబీ ప్లస్ 512 జీబీ ధర 76,999 వేలు, 24 జీబీ , వన్ టీబీ ధర 89,999 వేలుగా కంపెనీ నిర్ణయించింది. కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వన్ ప్లస్ 13లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ను పొందుపరిచారు. ఏఐ పవర్డ్ ఆక్సిజన్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో తీసుకొచ్చారు. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, వెనుక వైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్ వైటీ 808 మెయిన్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగా పిక్సెల్ ట్రైప్రిజమ్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఇక వన్ ప్లస్ 13 ఆర్ ఫీవర్స్ వైపు చూస్తే 12 జీబీ , 256 జీబీ వేరియెంట్ రేట్ 43 వేలు. 16 జీబీ, 512 జీబీ రేట్ 50 వేలుగా కంపెనీ నిర్ణయించింది. స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 3 ప్రాసెసర్ ఇందులో ఇచ్చారు. 6.78 స్క్రీన్ 1.5 ఓఎల్ ఈడీ, ఫీచర్స్ తో పాటు, ఏఐ పవర్డ్ ఆక్సిజన్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వన్ ప్లస్ 13 ఆర్ పని చేయనుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక వైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఎల్ వైటీ 700 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.   

error: Content is protected !!