
శుభమా అని కారు కొనాలని వెళ్తుంటే, మధ్యలో ఈ హెడ్డింగ్ ఏంటండీ, అని తిట్టుకోకండి. ఈ హెడ్డింగ్ పెట్టడానికి, రీజన్ కార్ల కంపెనీలే.. ఏళ్లకు ఏళ్లు ఆలోచించి, తెల్సినవారిని ,తెలియనివారికి ఎంక్వైరీ చేసి, అన్ని ఆలోచించుకుని, తీరా కారు కొందాం అని షోరూమ్ కు వెళ్లే కష్టమర్లకు , షాక్ ఇవ్వాలని కంపెనీలు డిసైడ్ అయ్యాయి. అదెలా అంటే, కార్ల ధరలను పెంచేస్తున్నాయి. అందుకు ఏప్రిల్ 1ని ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నాయి.
ముందు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, కియా ఇండియా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచక తప్పడంలేదంటూ స్టేట్ మెంట్ రిలీజ్ చేసాయి. దీంతో మిగితా కంపెనీలు అంటే, హ్యూందాయ్, హోండా కూడా ఇప్పుడు రేట్స్ పెంచక తప్పడం లేదంటూ రెడీ అవుతున్నాయి. తయారీ వ్యయం విపరీతంగా పెరిగింది. ముడి సరుకు ధరలు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుదల కనిపిస్తోంది. అందుకే కార్ల ధరలను మూడు శాతం పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
మారుతీ సుజుకీ అయితే 4 శాతం పెంపు ప్రకటించింది. టాటా మోటార్స్ 2 శాతం, కియా 3 శాతం కార్ల ధరలను పెంచాలని డిసైడ్ అయ్యాయి. ఏడాదిలో రెండో సారి కార్ల ధరలు పెరగడం పై వాహనదారులు అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు.