అసలే మెగా హీరోలకు, అల్లు అర్జున్ కు దూరం పెరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దశలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీ సాంగ్స్‌ను పొగుడుతూ, గేమ్ ఛేంజర్ సాంగ్స్ ను తక్కువ చేస్తూ తమన్ చేసిన కామెంట్స్, ఇప్పుడు సోషల్ మీడియాలో మంటను రాజేస్తున్నాయి.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు, మెగా ఫ్యాన్స్ కు మరోసారి గొడవ పెట్టేశాడు తమన్. సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్ అయింది గేమ్ ఛేంజర్. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే తమన్ మాత్రం పాటల్లో కొరియోగ్రాఫర్లు మంచి హుక్ స్టెప్ ఇవ్వలేదని, అందుకే సాంగ్స్ కు పెద్దగా వ్యూస్ రాలేదని చెప్పుకొచ్చాడు. అసలు సినిమా ఫెయిర్యూల్ కు హుక్ స్టెప్స్ లేకపోవడమే అన్నట్లు మాట్లాడాడు. అంతటితో అగాడా, అల్లు అర్జున్ నటించిన  బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో చిత్రంలోని ప్రతి పాటను అందులో హుక్ స్టెప్ ను పొగిడాడు. దాంతో సహజంగానే మెగా వర్సెస్ అల్లు మంట రాజుకుంది.

తమన్ డైరెక్ట్ గా రామ్ చరణ్ ను అన్నాడంటూ కామెంట్లు మొదలయ్యాయి. ఇదే సమయంలో రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో తమన్ ను అన్ ఫాలో అయ్యాడని పుకార్లు షికార్లు చేసాయి. గేమ్ ఛేంజర్ పై తమన్ చేసిన కామెంట్స్ వల్లే రామ్ చరణ్ కోపంతో, ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని స్టోరీలు కనిపించాయి. సీన్ కట్ చేస్తే మెగా కాంపౌండ్ అలాంటిది ఏం లేదు అని క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ చాలా తక్కువ మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడని, అందులో ముందు నుంచి తమన్ లేడని చెప్పుకొచ్చింది.

ఏది ఏమైనా తమన్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అసలే ఫ్లాపైన మూవీ, సినిమా నిండా హేమా హేమీలు ఉన్నారు. పైగా గాయంతో ఉన్నారు. ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ వారిని మరింత బాధపెడతాయి.

error: Content is protected !!