తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ న్యూ  మూవీ , ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా, జవాన్ డైరెక్టర్ తో మూవీని ఎనౌన్స్ చేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా విజన్ ఏంటి అనేది, ఎనౌన్స్ మెంట్ వీడియోలోనే చూపించాడు. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌ కు తీసుకెళ్తున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

అయితే ఈ మూవీ గురించి మరిన్ని ఆశక్తికర విషయాలు తెలిసాయి. అదేంటి అంటే దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అంటే రాజమౌళి, మహేష్ బాబు చిత్రం తర్వాత, ఇండియాలో అత్యఅధిక బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న చిత్రం ఇదే. ఇందులో దాదాపు 250 కోట్లు వీఎఫ్ ఎక్స్ కోసమే వినియోగించబోతున్నారట. గతంలో ఐరన్ మ్యాన్, ట్రాన్స్ ఫార్మార్మ్స్ మూవీస్ కు వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా వర్క్ చేసిన జేమ్స్ మ్యాడిగన్ పర్యవేక్షణతో ఈ సినిమా తెరకెక్కనుంది. అతనికి స్క్రిప్ట్ బాగా నచ్చింది. మూవీ మైండ్ బ్లాక్ చేస్తోందని చెబుతున్నాడు.

ఇక సినిమా రెమ్యూనరేషన్స్ విషయానికి వస్తే దర్శకుడు అట్లీ వంద కోట్లు తీసుకుంటున్నాడు. అలాగే అల్లు అర్జున్ 200 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట. ఇయర్ ఎండ్ కు రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.

error: Content is protected !!