
అట్లీ తో అల్లు అర్జున్ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి, పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ గురించే డిస్కషన్ జరుగుతోంది. ముందు ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లు అని లీక్ చేసారు. అ తర్వాత ఇయర్ ఎండ్ నుంచి షూటింగ్ అంటూ కన్ ఫామ్ చేసారు. కొద్ది గంటలుగా హీరోయిన్ ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది.
ప్రియాంక చోప్రా పేరు ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదు. ఎందుకంటే దేశీ గర్ల్ తగ్గేదేలే హీరోకు గట్టి షాకే ఇచ్చింది. ఎలా ఇచ్చింది అనేది ఈ కింద లింక్ లో ఉన్న స్టోరీలో చదవండి.
ప్రియాంక చోప్రా తన దగ్గర డేట్స్ లేవు అనడంతో, చిత్ర యూనిట్ ఇమిడియెట్ గా మరో హీరోయిన్ డేట్స్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో దర్శకుడు అట్లీకి, అలాగే అల్లు అర్జున్ కు తెల్సిన కథానాయికకే జిందాబాద్ కొట్టారని టాక్ వినిపిస్తోంది. అమె మెరవరో కాదు, లేడీ సూపర్ స్టార్ సమంత.
రెండేళ్లుగా సమంతకు సినిమాల్లేవ్. ఎందుకు లేవు అంటే, ఆమె అనారోగ్య సమస్యలే కారణం. మైయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది సామ్. అందుకే టెర్రిఫిక్ కమ్ బ్యాక్ మూవీ ఉండాలి అనుకుంటోంది. ఇంతలో అట్లీ, అల్లు అర్జున్ మూవీ ఆఫర్ ఆమెకు కావాల్సిన జోష్ తీసుకొచ్చింది. అట్లీతో తేరి, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ చేసింది సమంత. ఇక అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి, అలాగే పుష్ప-2 ఊ అంటావా సాంగ్ చేసింది. పైగా బన్ని అంటే సామ్ కు విపరీతమైన అభిమానం. అందుకే ఊ అంటావా కాంబో రిపీట్ కు లైన్ క్లియర్ అయింది అనేది టాక్.