పెట్రోల్, డీజిల్ కాదు, ఈవీలు జిందాబాద్ అంటున్నారు వాహనదారులు.భారత్ సహా వివిధ దేశాల్లో విద్యుత్ ఆధారత వాహనాలకు మంచి భవిష్యత్ ఉందని,ఇటీవలే ఒక అంతర్జాతీయ అధ్యయనం చెప్పుకొచ్చింది. ఐటీ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చేపట్టిన సర్వే ఇది. ఈ సర్వేలో ప్రతి 10 మందిలో ఆరుగురు లేదా ఏడుగురు తాము ఎలక్ట్రిక్ వెహికల్ కొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ సర్వేలో మేజర్ కంప్లైంట్ ఏంటంటే, చార్జింగ్ సుదుపాయలను కొరత వేధిస్తోందని చెప్పారు.

భారత్ సహా అమెరికా, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, చైనా, స్వీడన్, జపాన్, అస్ట్రేలియా, న్యూజీ లాండ్ లాంటి దేశాల్లో ఈ సర్వే ను నిర్వహించింది టీసీఎస్ కంపెనీ. అంతే కాదు మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, వేగంగా చార్జింగ్, ఎట్రాక్టివ్ డిజైన్, ఎక్కువ మైలేజీ లాంటివి ఈవీల కొనుగోళ్లను ఇంకా పెంచగలవు అని ఈ సర్వే చెబుతోంది. సింగిల్ చార్జింగ్ పై 200-300 కిలోమీటర్ల్ శ్రేణిలో మైలేజీ ఇచ్చే ఈవీలను కొనేందుకు వాహనదారులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సర్వే తెలుపుతోంది.

ఇవి కూడా చవవండి
error: Content is protected !!