
సనాతన ధర్మానికి, అధర్మ రాక్షసత్వానికి మధ్య , విధ్వంసకర యుద్ధం, జరిగితే ఎలా ఉంటుందో తెలుసా.. అయితే మీరు అర్జెంటుగా వృషభ సినిమా చూడాల్సిందే.
కొత్తగా కనిపిస్తోన్న నటీ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అని కాదు, కంటెంట్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. కథపై నమ్మకం దర్శక నిర్మాతలు చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రధాన పాత్రల్లో నటించిన నటీ నటులపై ప్రశంసలు కురిపించాల్సిందే. ముందు టైటిల్ తో , ఆ తర్వాత ట్రైలర్ తో, సాంగ్స్ తో వృషభ ఇంప్రెస్ చేస్తూనే ఉంది. అందుకే ఈ సినిమా ట్రైలర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మూవీ రిలీజ్ పై మంచి అంచనాలు తీసుకొచ్చాయి.
ఇంతకీ వృషభ కథేంటి..
1960 సంవత్సరానికి సంబంధించిన స్టోరీ ఇది. ఒక మర్మమైన వ్యాధి పశువులకు సోకుతుంది. రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. పెద్ద ఎత్తున పశువుల మరణంతో, దేశంలో పోషకాహార లోపం సంభవిస్తే, అల్లకల్లోలం అవుతుందని గ్రహించి, శాస్త్రవేత్తలు ఆ వ్యాధికి విరుగుడు ప్రయత్నాలకు ప్రయోగాలు మొదలు పెడతారు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఔషధం కనిపెట్టలేరు. ఇక ఫలితం లేదని నిర్ణయించుకున్న తర్వాత, దైవ సహకార కోసం హిమాలయాల్లో ఉన్న దిగంబర స్వామిని కలిసేందుకు వెళతారు శాస్త్రవేత్తలు. అంతా కష్టపడి స్వామి దగ్గరికి వెళ్తే, అక్కడ స్వామి నుంచి మౌనమే సమాధానంగా వస్తుంది. కాని సమస్య పరిష్కారానికి మార్గం సూచిస్తాడు స్వామి.ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. మరో వైపు కథ 1990కి మారినప్పుడు కథనాయకుడు బసవుడు పాత్ర పరిచయం అవుతుంది. అతని కథ ఆసక్తికరంగా ఉంటుంది. తన జీవితం తన ఇష్టం అంటూ బ్రతికేస్తుంటాడు. ఈ దశలో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది.చిత్ర విచిత్ర సంఘటలను వెంటాడుతాయి. ఒక దశలో శివ నందీశ్వర ఆలయ పూజారి సహాయం కోరుతాడు. అక్కడ తన కుటుంబానికి జరిగిన అన్యాయం, ఆ తర్వాత ఏం చేయాలి అనేది తెల్సుకుంటాడు. బసవుడు జీవితం ఎందుకు అలా ఉంది? తన కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? 1960, 1990 సంవత్సరాలకు ఎలా సంబంధం కుదిరింది. అన్ని విషయాలను సినిమా చూస్తే అర్ధమవుతుంది.
పాత్రలు .. తీరు తెన్నులు..
జీవన్, అలేఖ్య, కృష్ణ, శ్రీలేఖ, మురళీ కృష్ణ , నవీన్, లక్ష్మి, జబర్దస్త్ నటులు గడ్డం నవీన్, ఫిమా, రియాజ్, బాబీ నటన బాగుంది. కథకు అనుగుణంగా వీరి నటన రక్తి కట్టింది. ముఖ్యంగా మాధవి నటన మూవీకే హైలైట్. తన డైలాగ్స్ కు థియేటర్స్ రెస్పాన్స్ అదిరిపోతోంది.
టెక్నికల్ విభాగం..
ఒక అసాధారణ కథకు ప్రాణం పోయాలి అంటే డీఓపీ చాలా కీలకం. ఆ విషయంలో కెమెరా మెన్ విజయ్ కు మంచి మార్కులు సాధించాడు. ఇక ఎడిటర్ మహేంద్రనాథ్, సంగీతం అందించినఎం ఎల్ రాజా, సినిమాకు మరో ప్రధాన బలం. మరో విశేషం అంటే వృషభ కథను రాసింది ఉమాశంకర్ రెడ్డి. ఆయనే ఈ సినిమా నిర్మాత. పైగా అద్భుతమైన డైలాగ్స్ రాసి అదరగొట్టారు.
స్క్రీన్ ప్లే
ఇలాంటి పవర్ ఫుల్ స్టోరీకి స్క్రీన్ ప్లే చాలా కీలకంగా కనిపిస్తుంది. ఆ విభాగంలో దర్శకుడు అశ్విన్ కామరాజ్ దుమ్మురేపాడు. టేకింగ్ చాలా బాగుంది. సినిమా ఎక్కడా బోరింగ్ గా లేకుండా దర్శకుడు అశ్విన్ తనదైన స్క్రీన్ ప్లేలో పరుగులు పెట్టించాడు.
మొత్తంగా వృషభ ,ఈ కాన్సెప్ట్ తో తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. కథ పరంగా, విజువల్స్ పరంగా, నటీ నటుల పరంగా, అన్ని విభాగాలు అత్యుత్తమంగా పని చేసాయి. ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాయి. కాబట్టి, తప్పక ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడండి..
ఈ చిత్రానికి ప్రైడ్ తెలుగు రేటింగ్ – 3/5