ప్రతి హీరోకు, ఒక కల  ఉంటుంది. కాని  బాలీవుడ్ హీరో, ఆమిర్ ఖాన్ కు మాత్రం, నటనలో కంటే కూడా, మహాభారతం నిర్మించాలి అనేది, కలగా మార్చుకున్నాడు. ఏన్నో ఏళ్ల క్రితమే తన మనసులో మాట బయటపెట్టాడు.రాజమౌళి మహాభారతం తీస్తాను అని చెప్పిన దాని కంటే ముందు నుంచి, ఆమిర్ ఖాన్ తీస్తే భారతమే తీస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందని, ప్రకటించేసాడు. అసలు ఆమిర్ ఖాన్ ప్లాన్ ఏంటి, మహాభారతంపై ఆమిర్ కు అంత ఇష్టం ఏంటి అనేది, ఇప్పుడు తెల్సుకుందాం.

బాలీవుడ్ అంటేనే ఖాన్స్. మూడు దశాబ్ధాలుగా వీరు, కొల్లగొడుతున్న వసూళ్లు, అందుకుంటున్న విజయాలతో, హిందీ సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదిగింది. ముఖ్యంగా ఆమిర్ ఖాన్, గజినితో బాలీవుడ్ కు మొదటిసారి 100 కోట్ల వసూళ్లను చూపించాడు. ఆ తర్వాత దంగల్ తో చైనాలో వెయ్యి కోట్లు కొల్లగొట్టి, ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల కోట్ల కోట్లను కొల్లగొట్టాడు. వీటి మధ్యలో త్రీ ఇడియెట్స్, పీకే, ధూమ్ 3 లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయితే దంగల్ తర్వాత కాస్త డల్ అయ్యాడు. ఇఫ్పుడు సితార జమీన్ పర్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.

ఇది కాకుండా తమిళంలో రజనీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీలో కీలక పాత్ర చేస్తున్నాడు ఆమిర్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మేకింగ్ లోనే మరో సూపర్ హీరో మూవీ చేస్తాడట. ఆ తర్వాత మాత్రం మహాభారతం పై ఆమిర్ ఖాన్ ఫోకస్ పెట్టబోతున్నాడు.

ఇదే ఏడాదిలో , ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రారంభించబోతున్నట్లు ఆమిర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మహాభారతం అంటే ఒకటి, రెండేళ్లలో, పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. పదేళ్లు పడుతుందని గతంలోనే ప్రకటించాడు ఆమిర్. ఇప్పుడు ఇంకా ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. ఐదు భాగాలుగా మహాభారతం చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఆమిర్. సుమారు రెండు వేల కోట్లతో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మహాభారతం కథ సిద్ధం కావడానికే రెండేళ్లు పడుతుంది. ఈలోపు చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి అవుతాయి. ఆ తర్వాత అప్పటికే సిద్ధమైన కథను పట్టుకుని, ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడిని ఎంపిక చేసి,  తెరకెక్కించే బాధ్యతను అప్పగించబోతున్నాడు ఆమిర్. గతంలో హాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిరీస్ లార్డ్ ఆఫ్ రింగ్స్ మూవీస్ ను ఒకేసారి తెరకెక్కించి, ఒక దాని తర్వాత మరొకటి విడుదల చేశారు. ఇప్పుడు  ఇదే ఫార్మాట్ ను మహాభారతం నిర్మించేందుకు అప్లై చేయబోతున్నాడు ఆమిర్.

మహాభారతం ప్రాజెక్ట్ ను ఆమిర్ నిర్మిస్తాడు. అలాగే ఒక భాగాన్ని డైరెక్ట్ చేస్తాడు. ఇంకో వైపు శ్రీకృష్ణుడి పాత్రలో తాను కనిపించినా ఆశ్చర్యంలేదు. మహాభారం కోసం పాన్ ఇండియా వైడ్ గా ఉన్న స్టారాతి స్టార్లను ప్రాజెక్ట్ లోకి తీసుకురాబోతున్నాడు ఆమిర్. మరో ఐదేళ్ల తర్వాతైనా మొదటి భాగం రిలీజ్ చేసే విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. మొత్తంగా రాజమౌళి కంటే ముందే ఆమిర్ మహాభారతాన్ని తెరకెక్కిస్తాను అన్నాడు. ఇప్పుడు రాజమౌళి కంటే ముందే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నాడు.

error: Content is protected !!