చూస్తుంటే ఇండియన్ సినిమా ఇప్పుడు పూర్తిగా, మైథాలజీ మాయలో పడినట్లు కనిపిస్తుంది. ప్రతి జానర్ కు ఒక సీజన్ ఉన్నట్లే, ఇప్పుడు పౌరాణిక చిత్రాలు తీస్తే,. ప్రేక్షకులు తీస్తారనే ధైర్యంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ పై ఎంత నమ్మకం లేకపోతే, రణభీర్ రామాయణం చిత్రాలు దాదాపు 1600 కోట్లతో తెరకెక్కుతాయి చెప్పండి, ఇప్పుడు ఇదే వరుసలో మహాభారతం తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు ఆమిర్ ఖాన్.

భారతం తెరకెక్కించడం అనేది ఆమిర్ ఖాన్ డ్రీమ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమయం ఆసన్నమైంది అంటున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అంతే కాదు ఆగస్ట్ నుంచే పనులు ప్రారంభమవుతాయిని సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. దంగల్ దర్శకుడు నితీష్ తివారి రామాయణ చిత్రాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. భారతాన్ని ఆమిర్ ఖాన్ అనేక భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు. అందులో భాగంగా అంతా కొత్త నటీన టులను ఎంపిక చేస్తాడట.

ఒక సిరీస్ గా మూవీస్ ను రిలీజ్ చేస్తూ వస్తుంటాడట. స్టార్స్ తీసుకుని ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించలేమని, పూర్తిగా కొత్త నటీ నటులతో మహాభారతాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు ఆమిర్ ఖాన్. ప్రస్తుతం రామాయణం పూర్తిగా స్టార్స్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడిగా రణభీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నిడియోల్ ఇలా సినిమా అంతా భారీ కాస్ట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనుంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!