ప్రైడ్ తెలుగు ఎక్స్ క్లూజివ్ స్టోరీ

తమిళ హీరో కార్తి చేసే సినిమాలు, అతని నటన తమిళంలోనే కాదు, తెలుగులోనూ బోల్డంత అభిమానులను సంపాదించి పెట్టింది. కాని కార్తి మాత్రం ఈ క్రేజ్ ను పట్టించుకోకుండా, తన దారిలో తాను వెళ్తున్నాడు. ఇప్పటికే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు. ఎలా అంటారా జపాన్, కంగువ, రీసెంట్ గా సత్యం సుందరం. అన్ని ఫ్లాపే. అయితే నటుడిగా కార్తికి మంచి పేరు తెచ్చి పెట్టాయి ఈ చిత్రాలు.. ఏ పాత్ర చేసినా, పరకాయ ప్రవేశం చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు.

అలాంటి నటుడు ఇప్పుడు ఒకే తరహాగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. కార్తి చేతిలో ప్రస్తుతం వా వాతియార్ అనే మూవీ ఉంది. ఇది కాకుండా సర్దార్ సీక్వెల్ ఇటీవలే ఎనౌన్స్ చేసాడు. ఇప్పుడు హిట్ 4 కన్ ఫామ్ చేసాడు. ఇవి కాకుండా ఖైదీ 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లైనప్ చూస్తుంటే కార్తి మొత్తానికి మొత్తం సీక్వెల్స్ కు జిందాబాద్ కొడుతున్నాడు అనే విషయం ఇట్టే అర్ధమవుతుంది. ఇంకా లిస్ట్ లో కంగువ 2, ఖాకీ సీక్వెల్ ఉన్నాయి.

error: Content is protected !!