సందీప్ వంగా దర్శకత్వంలో కొద్ది రోజుల క్రితం, అల్లు అర్జున్ ఒక చిత్రం ఎనౌన్స్ చేసాడు. మీకు గుర్తుండే ఉంటుంది. బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ టీసిరీస్ కంపెనీ వీరి కాంబినేషన్ లో చిత్రాన్ని, నిర్మించేందుకు డీల్ కుదుర్చుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని, బాలీవుడ్ వర్గాల్లో బాగా ప్రచారం సాగుతోంది. అలా ఎలా ఇంత క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అంటే, అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే అని చెబుతోంది హిందీ ఇండస్ట్రీ.

స్పిరిట్ లో దీపికను ఎంపిక చేసి, ఏదో సమస్య వల్ల ఆమె తప్పుకుంది. అందుకు సందీప్ వంగా ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసింది బాలీవుడ్. పైగా తన కథను లీక్ చేస్తోందని ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో  ఫైర్ అయ్యాడు సందీప్ వంగా. ఇంత జరిగిన తర్వాత దీపిక వెళ్లి అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ చిత్రంలో భాగం అయింది. ఇందుకు సందీప్ వంగా హర్ట్ అయ్యాడట. అందుకే అల్లు అర్జున్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇది ఎంత వరకు నిజం అనేది క్లారిటీ లేదు. కాని తెలుగు నాట కొత్త చిత్రాలు ఎనౌన్స్ చేసి, చాలా సార్లు క్యాన్సిల్ చేసాడు అల్లు అర్జున్. ముందు కొరటాలతో చిత్రం, రీసెంట్ గా త్రివిక్రమ్ తో మూవీ … సెట్స్ మీదకు వెళ్తూ వెళ్తూ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ చేయాల్సిన చిత్రాలను రెండు సార్లు తారక్ అందుకోవడం విశేషం. అల్లు అర్జున్ కొరటాలతో చేయాలనుకున్న చిత్రం ఎన్టీఆర్ తో దేవరగా వచ్చింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ సిద్ధం చేసిన మైథాలజీ మూవీలోకి ఎన్టీఆర్ అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!