అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే పేరు ఉండేది. అది సదరన్ స్టార్ గా మారింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అని వచ్చింది. అయితే మూడో పేరు రావడానికి కారణం, మాత్రం వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. అతను అల్లు అర్జున్ కోసం ఐకాన్ అనే టైటిల్ తో, దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేసాడు. అందుకు తగ్గ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని అల్లు అర్జున్ ఈ సినిమాను ఎన్ని సార్లు వీలు అయితే, అన్ని సార్లు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు.

ముందు అల వైకుంఠపురములో తర్వాత చేస్తాను అన్నాడు. ఆ తర్వాత పుష్ప వన్ తర్వాత చేస్తాను అన్నాడు. పుష్ప-2తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. వేణు శ్రీరామ్ ను పక్కనపెట్టి, ప్రస్తుతం అట్లీ అనే తమిళ దర్శకుడితో కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్ చేస్తున్నాడు. దీంతో వేణు శ్రీరామ్ ఐకాన్ హీరోను మార్చేసాడు. అందుకు దిల్ రాజు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేంది. టాలీవుడ్ నుంచి ఏ హీరో వచ్చి, ఇప్పుడు ఐకాన్ గా నటిస్తాడు అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు అదే టైటిల్ తో మరో హీరో సినిమా చేస్తాడా అనేది డౌటే. సో ఐకాన్ స్టార్ ఐకాన్ నుంచి బయటికి వచ్చినా, ఈ ప్రాజెక్ట్ కు ఇబ్బందే.. పాపం వేణు శ్రీరామ్ ఏం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!