
తమిళ హీరో అజిత్ క్రేజ్ గురించి చెప్పేది ఏముంది.. తెలుగులోనూ అజిత్ కు వీరాభిమానులు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. అదేంటి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అజిత్, ఈ మధ్య సన్నబడ్డాడు. గత పదేళ్లుగా సినిమాల కోసం తగ్గని అజిత్, తన ఫేవరేట్ స్పోర్ట్స్ కార్ రేసింగ్ కోసం తగ్గాలి అనుకున్నాడు.
అందుకోసం ముందుగా డైట్ ప్రారంభించాడు. 8 నెలల్లో 42 కేజీలు తగ్గాడు. అంటే గత ఏడాది ఆగస్ట్ లో డైట్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా మారాడు. రేసింగ్ అంటే ఫిట్ ఉండాలి. అందుకే, పూర్తిగా వెజిటేరియన్ గా మారాడు. ఆల్కహాల్ మానేసాడు.స్విమ్మింగ్, సైకిలింగ్ చేసాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు.
ఇక అజిత్ సినిమాల గురించి అంటారా ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ కు పవర్ పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. నవంబర్ నుంచి న్యూ మూవీ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. ఈ లోపు మాత్రం కార్ రేసింగ్ మీదే ఫోకస్ పెడతాడట.