డిసెంబర్ 5న అఖండ సీక్వెల్ రిలీజ్ కావాల్సి ఉండగా, చివరి నిముషంలో మూవీ వాయిదా పడింది. అందుకు ఈరోస్‌కు 14 రీల్స్ బకాయిలు ప్రధాన కారణం, మొత్తంగా ఇప్పుడు సమస్యలు తొలిగిపోయాయి. అఖండ సీక్వెల్ కు లైన్ క్లియర్ అయింది. దీంతో నిర్మాతలు డిసెంబర్ 12న గ్రాండ్ గా మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో బుకింగ్ సైతం ఓపెన్ అయిపోయింది.

డిసెంబర్ 5న సినిమా రిలీజ్, అంతకు ముందు రోజు అంటే 4 సాయంత్రం ప్రీమియర్స్ అంటూ బాలకృష్ణ పెట్టిన ముహూర్తానికి అఖండ సీక్వెల్ ఆగిపోవడంతో, ఆయన కూడా కినుక వహించారని, 14 రీల్స్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం, ఈ కోపాలు అన్ని తగ్గిపోతాయి. విజయం తెచ్చే ఆనందంతో యూనిట్ పడ్డ కష్టం అంతా గాల్లో కలసిపోతుంది. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పై తెలుగు సినీ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్య అభిమానుల సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!