
ఫ్లాష్ .. ఫ్లాష్ అనుకోండి.. బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనుకోండి.. తెలుగు సినిమా చరిత్రలో, ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో నటుడిగా వెలుగుతున్నారు బాలకృష్ణ. ఆయన నటించిన కొత్త చిత్రం అఖండ -2 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. పైగా పాన్ ఇండియా వైడ్ గా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడంతో, భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహించారు. కట్ చేస్తే ముందు ఒక రోజు ముందు పడాల్సిన ప్రీమియర్స్ రద్దు అయ్యాయి. అన్నిటికి మించి సినిమా డిసెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ అయింది.
ఇలా ఎందుకు అంటే ఖచ్చితమైన వివరాలు తెలియవు. ఫ్యాన్స్, ఆడియెన్స్ ప్రీమియర్స్ కోసం థియేటర్స్ వరకు వెళ్లిన తర్వాత ఈ సిచ్యువేషన్ అంటే, పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎరోస్ ఇంటర్నెషనల్ కు 14 రీల్స్ సంస్థ చెల్లించాల్సిన డ్యూస్ వల్లే, ఈ మూవీ రిలీజ్ క్లియర్ కాలేదు అనేది ప్రముఖంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా, ఇలా అయితే జరగకుండా ఉండాల్సింది. కనీసం సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా నిర్మాతలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి
