హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మాత్రమే సినిమాలు ఛాన్సులు. ఇది అల్లు అర్జున్ ఈ మధ్య ఫాలో అవుతున్న సింపుల్ ఈక్వెషన్.. సేఫ్ సైడ్ చూసుకోవచ్చు కాని, మరీ ఇంతగానా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా త్రివిక్రమ్ తో చేయాల్సిన మైథాలజీని బన్ని పక్కనపెట్టడంతో, ఇప్పుడు బన్ని విధానాన్ని కొందరు తప్పబడుతున్నారు. గుంటూరు కారం వీక్ గా తీసాడు. లేదా తాను అనుకున్న మైథాలజీ స్టోరీ కరెక్ట్ గా లేదు.. రీజన్ ఏదైనా, అల్లు అర్జున్ ను స్టార్ ను చేసిన త్రివిక్రమ్ ను, ఇప్పుడు తాను పక్కనపెట్టడం ఇండస్ట్రీ వాళ్లకే షాకింగ్ గా ఉంది. ఒక జులాయి, ఒక సన్నాఫ్ సత్యమూర్తి, ఒక అల వైకుంఠపురములో లాంటి చిత్రాలతో, అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టాడు త్రివిక్రమ్.

అంతకు ముందు వేణు శ్రీరామ్ తో ఐకాన్ ఎనౌన్స్ చేసాడు అల్లు అర్జున్. ఆ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టాడు. ఆ తర్వాత కొరటాల శివతో, సినిమా ఎనౌన్స్ చేసాడు. అదీ పక్కనపెట్టాడు. అదే తర్వాత దేవరగా మారిందని ఇండస్ట్రీ వాళ్లు చెబుతారు. మధ్యలో మురుగదాస్ తో స్టోరీ రాయించుకున్నాడు. అంతకు ముందు ఆవారా దర్శకుడు లింగుస్వామితో మూవీ ఎనౌన్స్ చేసి తప్పుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ ఫామ్ లో లేడని, అతని ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు.

మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో షారుఖ్ తో జవాన్ లాంటి పాన్ ఇండయా బ్లాక్ బస్టర్ తీసిన అట్లీతో చేతులు కలిపాడు. ఇప్పుడు లైన్ లో ప్రశాంత్ నీల్ ను పెడుతున్నాడని తెలుస్తోంది. కాని ఇలా ఎంత కాలం అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. హిట్ ఇచ్చిన దర్శకులకే సినిమాలు. వాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడే బ్లాక్ బస్టర్స్ అంటే .. బన్ని మరీ జాగ్రత్త పడుతున్నాడేమో అంటున్నారు సినిమా జనాలు.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి
ఇది కూడా చదవండి

error: Content is protected !!