త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ చేసుకుని, అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడో తెలుసా.? మాలీవుడ్ వెళ్తున్నాడు.? అక్కడ బేసిల్ జోసెఫ్ అనే యువ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు. మలయాళంలో నాలుగేళ్ల క్రితం మిన్నల్ మురళి అనే సూపర్ హీరో తీసి, పాన్ ఇండియాను ఆశ్చర్యపరిచాడు జోసెఫ్. ఆ తర్వాత యాక్టర్ గా బిజీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో మలయాళంతో తిరుగులేని నటుడిగా మారాడు. జయ జయ హే, సూక్ష్మదర్శిని, పోన్ మాన్ లాంటి చిత్రాలతో, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు నాట కూడా ఇతని నటనకు అభిమానులు ఉన్నారు.

ఈ సంగతి అంతా ఇప్పుడు ఎందుకంటే, అల్లు అర్జున్ ఇప్పుడు ఈ యాక్టర్ కమ్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడు. అట్లీతో తమిళ చిత్రంలో నటించిన తర్వాత మలయాళం వెళ్లి, అక్కడ బేసిల్ తో సినిమా చేస్తాడట. ఇలా ఎందుకు అంటే తెలుగు హీరోల్లో మాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. తాను నటించిన ఆర్య, ఆర్య-2, సరైనోడు, లాంటి చిత్రాలు అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మల్లు అర్జున్ గా మార్చాయి. అందుకే మాలీవుడ్  మార్కెట్ పై మరింత పట్టు పెంచుకునేందుకు అల్లు అర్జున్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇది.

ఇక అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తోన్న మూవీ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతానికి దీపిక పదుకొనె హీరోయిన్ గా ఖరారు అయింది. ఇంకా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తారని ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!