తమిళ హీరోలు తెలుగు దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపుతుంటే, వరుస విజయాలను అందుకుంటుంటే, తెలుగు హీరోలు, తమిళ దర్శకుల వైపు చూస్తున్నారు. పుష్ప -2 లాంటి అఖండ విజయం తర్వాత అల్లు అర్జున్ వెళ్లి అట్లీకి డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో బిగ్ మూవీ తెరకెక్కుతోంది. తారక్ కూడా జైలర్ డైరెక్టర్ నెల్సన్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా కోలీవుడ్ వైపు చూస్తున్నాడని సమాచారం.

గత ఏడాది అమరన్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన రాజ్ కుమార్ పెరియా స్వామి ఉన్నాడుగా, అతను రీసెంట్ గా రెబల్ కోసం స్టోరీ రెడీ చేసి, అతనికి వినిపించాట. కథ నచ్చిన బాహుబలి వెంటనే డేట్స్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ రూమర్ ఇటు టాలీవుడ్ ను అటు కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ కాంబోలో సినిమా రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రాజ్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్ తో తీస్తున్నాడు. రెబల్ మాత్రం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ డిసెంబర్ లో రిలీజ్ ఉంది. ఆ తర్వాత ఫౌజీ, అలాగే స్పిరిట్, ఇంకా కల్కి -2, సలార్ -2, లాంటి చిత్రాలు ఉన్నాయి. వీటి తర్వాతే అమరన్ తో అమరేంద్ర బాహుబలి సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి

error: Content is protected !!