ఇండియాలో టాప్ ఓటీటీస్ ఏంటి.. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్. కరోనా టైమ్ లో ఇంటి ఇంటికి చేరువ అయ్యాయి. మొదట్లో సాధారణ రేట్లలో ఇవి అందుబాటులో ఉండేవి. అన్నటికంటే నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఎక్కువ. ఎందుకంటే అందుకు తగ్గ కంటెంట్ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉంది. ఇక హాట్ స్టార్ సంగతి అంటారా.. జియో సినిమాను, పికాక్ ను, హెచ్ బీ ఓ షోస్ ను కలుపుకుని మొత్తంగా ఐపీఎల్ పుణ్యమా అని ఓటీటీ కష్టమర్లకు బాగానే దగ్గరైంది. అయితే అమెజాన్ ప్రైమ్ తీరు మాత్రమే మొదటి నుంచి ఓటీటీ కష్టమర్స్ సహనాన్ని పరిక్షిస్తుంది.

రోజు రోజుకు ఎంగేజింగ్ కంటెంట్ తగ్గిపోతోంది. సూపర్ హిట్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ తగ్గిపోయింది. ఈ దశలో ప్రైమ్ మళ్లీ యాడ్స్ అంటూ కొత్త ప్లాన్స్ తీసుకొస్తోంది. మే 17 నుంచి ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్స్ కు యాడ్స్ ప్లే చేస్తామంటోంది. అలా వద్దు అనుకుంటే అదనంగా 129 , అదే ఏడాది  మొత్తం యాడ్స్ లేకుండా ప్రైమ్ లో మూవీస్, షోస్ చూడాలి అనుకుంటే అందుకు 699 కట్టాలట. ఎప్పుడైతే ప్రైమ్ ఇలా యాడ్స్ కు అదనంగా చార్జీలు ప్రకటించిందో, ప్రైమ్ కష్టమర్స్ మండిపడటం స్టార్ట్ చేసారు.

అసలు ప్రైమ్ లో ఏముంది.. ఉన్న సినిమాలకు రెంటెల్ పద్దతిలోనే అందుబాటులో ఉన్నాయి. కొత్త సినిమా రిలీజైందా అది కూడా రెంటల్ ప్లాన్ లోనే ఉంటుంది. ఈ మాత్రం దానికి అమెజాన్ ప్రైమ్ ఎందుకు అనే ఫీలింగ్ కు వచ్చేశారు కష్టమర్స్.. అమెజాన్ ప్రైమ్ కొత్త సినిమాల కంటే కూడా ఫ్యామిలీ మేన్, పంచాయత్, మిర్జాపూర్, పాతాల్ లోక్ లాంటి సూపర్ హిట్ షోస్ కు  కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలాంటి ప్లాట్ ఫామ్ ఇలా యాడ్స్ ను ప్లే చేయడం మాత్రమే కాకుండా..1499 ప్లాన్ కు అదనంగా 699 చెల్లించమనడం మాత్రం దారణం.

ఈ యాడ్స్ ప్లాన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ కు గట్టి దెబ్బ తగిలే అవకాశాలే ఉన్నాయి. అసలే ఆన్ లైన్ లో పైరసీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ దశలో ఓటీటీ వ్యూస్ కూడా తగ్గుతున్నాయి. అయినా సరే అమెజాన్ ప్రైమ్ మొండి పట్టుదలకు పోయి యాడ్స్ చూడకూడదు అంటే డబ్బులు కట్టాలి అంటోంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!