జైలర్ స్టోరీ చాలా మంది హీరోలను డిమాండ్ చేస్తుంది. అందుకే జైలర్ మొదటి భాగంలో రజనీకాంత్ తో పాటు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి లెజెండరీ యాక్టర్స్  సర్ ప్రైజ్ చేసారు. ఇప్పుడు సీక్వెల్ సినిమాలో సైతం, మరింతమంది స్టార్స్ ను డిమాండ్ చేస్తోంది జైలర్ స్టోరీ. అందుకే బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ లాంటి వారు కూడా తోడయయ్యారు. అదే స్పీడ్ లో టాలీవుడ్ నుంచి బాలయ్య డేట్స్ కోసం చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నాడు నెల్సన్. నిజానికి మొదటి భాగంలోనే బాలయ్య కనిపించాల్సింది. కాని ఎందుకో నో చెప్పాడు బాలయ్య. సీక్వెల్ తెరకెక్కుతున్న సమయంలో మరోసారి బాలయ్య  పేరు వినిపించింది.ఈసారి జైలర్ తో పాటు అఖండ కూడా కనిపిస్తాడని టాక్ వినిపించింది. కాని బాలయ్య మరోసారి నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ ను మాలీవుడ్ స్టార్ ఫాహద్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ గోవాలో జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్ లో జైలర్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!