
తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ అట్టహాసంగా, ప్రకటించిన భారీ చిత్రం గురించి తెల్సిందే. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించే సైన్స్ ఫిక్షన్ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే, అంటే మూవీ ఎనౌన్స్ చేసిన కొద్ది గంటలకే చిత్ర యూనిట్ కు గట్టి షాక్ తగిలింది. అదేంటి అంటే,హీరోయిన్ ప్రియాంక చోప్రా తప్పుకుందట. అదేంటి ఈమె అసలు ఎప్పుడు అడుగు పెట్టింది, ఎప్పుడు వెళ్లిపోయింది. ఇదంతా రూమర్ అనడానికి లేదు.
నిజానికి అల్లు అర్జున్ కంటే ముందు సేమ్ స్టోరీని అట్లీ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు చెప్పాడు. ఆయన రజనీకాంత్, కమల్ హాసన్ తో కలసి భారీ మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని మలచాలి అని ప్రయత్నించాడు. రేపో మాపో ఎనౌన్స్ మెంట్ అనుకుంటుండగా ఈ మూవీ నుంచి సల్మాన్ తప్పుకున్నాడు. రజనీకాంత్ డేట్స్ సర్దుబాటు కాని కారణంగా, బడ్జెట్ ఇష్యూస్ ఉండటం వల్ల, సల్మాన్ నో చెప్పాడు. అయితే అప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా డేట్స్ అడిగేసాడు అట్లీ. సల్మాన్ ఖాన్ క్లోజ్ కావడంతో ప్రియాంక చోప్రా డేట్స్ ఇచ్చేసింది.
ఇఫ్పుడు సేమ్ స్టోరీలో హీరో మారడం, సల్మాన్ స్థానంలో అల్లు అర్జున్ రావడంతో, ప్రియాంక చోప్రా నో చెప్పిందట. తన దగ్గర డేట్స్ లేవని చెబుతోందట. పైగా చేతిలో మహేష్ మూవీ, అలాగే త్వరలో క్రిష్ 4 ఉండటంతో అట్లీ అండ్ అల్లు అర్జున్ కు సింపుల్ గా సారీ చెప్పేసిందట. మరి బన్ని అండ్ అతని తమిళ దర్శకుడు ఏ హీరోయిన్ కు అవకాశం ఇస్తారు అనేది మరి కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.