
మీరు చూసిన ఫ్యాక్టరీ ఎంత ఉంటుంది చెప్పండి. మరీ 32 వేల ఎకరాలు అయితే ఉండదు కదా.. అన్నేసి ఎకరాల్లో నిర్మించడానికి, అది అమరావతి కాదు కదా… అంటారా, కాని చైనా లో ఒక కారు కంపెనీ అదే చేస్తోంది. దాదాపు 32 వేల ఎకరాల్లో అతి పెద్ద కార్ ఫ్యాక్టరీని కడుతోంది. అంటే అమెరికాలోని ఒక నగరం కంటే పెద్దది.
చైనాలోని జెంగ్ ఝౌ లో బీవైడీ కార్ల కంపెనీ ఓ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. 32 ఎకరాల్లో నిర్మాణం చేపట్టిందని సమాచారం. ఈ విషయం కూడా డ్రోన్ ద్వారా లీక్ అయిందట. ఈ ఫ్యాక్టరీలో అనేక భవనాలు, ఓ ఫుట్ బాల్ మైదానం, టెన్నిస్ కోర్టులు కూడా ఉంటాయట. మొత్తంగా 60 వేల మంది పని చేస్తున్నారట. దాంతో ఇప్పుడే నిర్మాణ దశలోనే బీవైడీ ఫ్యాక్టరీ మహానగరాన్ని తలపిస్తోందట.
బీవైడీ కంపెనీలో ఇప్పటికే 9 లక్షల మంది పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరో 3 లక్షలమంది ఉద్యోగాలను ఈ కంపెనీ నియమించబోతుందట. అదే జరిగితే కేవలం బీవైడీ ఫ్యాక్టరీనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కంటే పెద్దగా కనిపించడం ఖాయం. భూమిపై ఎలాంటి అద్భుతాలకైనా చైనానే చిరునామాగా మారుతోంది.