టాలీవుడ్ లో ప్రస్తుతం నాని హవా నడుస్తోంది. నాని కథల జడ్జిమెంట్ పై మెగాస్టార్ అంతటి వాడే బాగా నమ్ముతున్నాడు. నాని కనుక ఒక స్టోరీ టేకప్ చేస్తే, అది తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అనే సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతోంది.

నేచురల్ స్టార్ వరుస విజయాలు, పైగా నిర్మాతగా కోర్ట్ లాంటి భారీ బ్లాక్ బస్టర్, దాంతో నాని బ్యానర్ లో పని చేసేందుకు హీరోలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే చిరు, శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్ లో నాని ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పుడు కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నాడట.

నిజానికి రామ్ జగదీశ్ దగ్గర కోర్ట్ లాంటి కథలు చాలానే ఉన్నాయి. అందుకే కోర్ట్ కు సీక్వెల్స్ వస్తాయి అని గతంలోనే నాని చెప్పాడు. అందుకే ఇప్పుడు కోర్ట్ సీక్వెల్లో దుల్కర్ పేరు వినిపిస్తోంది. లక్కీ భాస్కర్ విజయం తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తున్నాడు దుల్కర్. ప్రస్తుతం ఆకాశం లో ఒక తార చిత్రంలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
error: Content is protected !!