తమిళనాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్  కల్యాణ్ పై కేసు నమోదు కావడంపై, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో దుర్మార్గపు పాలన కొనసాగుతుంది అన్నారు. పవన్ పై కేసు పెట్టడాన్ని, మురుగన్ పై దాడిగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు మాధవ్.

తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలైకి అండగా పవన్ కూడా రంగంలోకి దిగారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వీరిద్దరికి తాము అండగా ఉంటామని తెలిపారు తమిళనాడు అధ్యక్షుడు. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని మాధవ్ చెప్పారు. మధురైలో ఇటీవల జరిగిన మురుగన్ భక్తుల ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లఘించి, పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో ఈ కేసును నమోదు చేసారు. పవన్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. డీఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాస్పదమైంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!