
ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, స్పిరిట్. ఎందుకంటే ఇది యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్నాడు.ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. సందీప్ వంగా హీరోయిజం ఎలా ఉంటుందో అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్ లో చూసారు ఆడియెన్స్ .అందుకే వంగా మేకింగ్ రెబల్ ఎలా ఉంటాడో చూడాలి అనుకుంటున్నారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే,ఈ పాటికి స్పిరిట్ స్టార్ట్ కావాలి.
అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న చిత్రాలు ఆలస్యం అవుతుండటంతో , స్పిరిట్ కూడా పోస్ట్ పోన్ అవుతోంది. ఈలోపు సందీప్ వంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్, అలాగే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. ఇటీవలే కల్కి హీరోయిన్ దీపిక పదుకొనెను,హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం సాగింది. ఆమెను ప్రభాస్ సరసన నటింపజేసేందుకు నిర్మాతలు దాదాపు 30కోట్లు ఆఫర్ చేసారని, అసలు స్పిరిట్ స్టోరీని దీపికకు సందీప్ ఎప్పుడో చెప్పాడని, ఇలా రకరకాల వార్త వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు దీపిక స్పిరిట్ నుంచి తప్పుకుందట. ఎందుకు తప్పుకుంది అంటే డేట్స్ ప్రాబ్లమ్ అట. అనుకున్న సమయానికి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతోనే దీపిక ఈ చిత్రం నుంచి వాకౌట్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం దీపిక స్థానంలో మరో హీరోయిన్ డేట్స్ కోసం సందీప్ వంగా ట్రై చేస్తున్నాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక అని బాగా ప్రచారం సాగుతోంది. యానిమల్ కోసం సందీప్ వంగా మేకింగ్ లో నటించింది రష్మిక. పైగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరోయిన్. అందుకే తన పేరు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇదే నిజమైతే రష్మిక, ప్రభాస్ కాంబినేషన్ ఆడియెన్స్ కు ఫీస్ట్ గా మారుతుంది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి