
టాలీవుడ్ నుంచి చాలా పాన్ ఇండియా సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్నాయి. అందులో కార్తికేయ -3 కూడా ఉంది. మూడేళ్ల క్రితం రిలీజైన కార్తికేయ-2 పాన్ ఇండియా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ ఎనౌన్స్ చేసారు. అయితే అందుకు ఇంకా సమయం ఉంది అంటున్నాడు దర్శకుడు చందు మొండేటి. ప్రస్తుతం తండేల్ తెరకెక్కించాడు. ఆ తర్వాత సూర్య తో మూవీ ప్లానింగ్ లో ఉంది అంటున్నాడు. సూర్య తో సినిమా చిన్న విషయం కాదు. సినిమాతో మూవీ లాక్ చేసుకున్న దర్శకులు ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో చందూ మొండేటి చేరుతాడో లేదో చూడాల్సి ఉంది.
అయితే సూర్య తో మూవీ తర్వాత చందూ మొండేటి కార్తికేయ-3 తెరకెక్కిస్తాను అంటున్నాడు. ఈసారి కృష్ణుడి నేపథ్యంలో కథను చెబుతాను అంటున్నాడు.ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, అలాగే లోకేషన్స్ కూడా ఫైనల్ చేసేసారట. చందూ రెడీ అంటే హీరో నిఖిల్ కూడా రెడీ అయిపోతాడు. 2014లో కార్తికేయ వన్ రిలీజైంది. 4 కోట్లతో తెరకెక్కింది. 20 కోట్లు రాబట్టి సంచలన విజయం సాధించింది. మూడేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ సీక్వెల్ కూడా కేవలం 15 కోట్ల తో తెరకెక్కి, హిందీ ఆడియెన్స్ సపోర్ట్ తో 120కోట్ల వరకు రాబట్టింది. అందుకే ఈసారి భారీ బడ్జెట్ తో మూడో భాగాన్ని తెరకెక్కించాలి అనుకుంటున్నాడు చందూ మొండేటి
ఇవి కూడా చవవండి..