కిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో వెంకీ సినిమా?

ఎంతవరకు నిజం.. ఏజెంట్ తీసి చేతులు కాల్చుకున్న సురేందర్ రెడ్డి

సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ డెసిషన్ ఏంటి?

సంక్రాంతికి వస్తున్నాం తో టాలీవుడ్ కు తిరుగులేని కమ్ బ్యాక్ ఇచ్చాడు వెంకటేష్. సంక్రాంతి సీజన్ లో రిలీజై 300 కోట్లకు పైగా కొల్లగొట్టి తెలుగు సినీ పరిశ్రమకు, గొప్ప విజయాన్ని అందించింది. ఇటీవలే ఓటీటీలో విడుదలై, అక్కడా రికార్డులు తిరగరాస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత వెంకటేష్ నటించబోయే సినిమా ఏంటి అనేది, కొద్ది రోజులుగా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత, వెంకీ ఎవరితో సినిమా చేస్తాడు, ఎవరికి డేట్స్ ఇస్తాడు అనేది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. అభిమానుల్లో కూడా క్యూరియాసిటీ నెలకొని ఉంది.

ఇదే సమయంలో సురేందర్ రెడ్డి మేకింగ్ లో వెంకీ ఒక స్టైలిష్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. కిక్, రేసుగుర్రం , సైరా లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన సురేందర్ రెడ్డి, విక్టరీతో చేతులు కలపి ఎలాంటి సినిమా తీస్తాడా అనేది చర్చ మొదలైంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చేసింది. సురేందర్ రెడ్డితో వెంకటేష్ ఎలాంటి మూవీ చేయడం లేదని కన్ ఫామ్ అయింది.  మరి విక్టరీ ఎవరితో మూవీ చేస్తాడు అనే తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. పలువురు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, వెంకీని కలసి సినిమా చేసేందుకు డేట్స్ లాక్ చేసే ప్రయత్నం చేస్తోన్న విక్టరీ మాత్రం ఎక్కడా తొందర పడటం లేదు. పైగా తన చేతిలో రానా నాయుడు సీజన్ -2 ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ ఉంది. వన్స్ రానా నాయుడు సీజన్ టూ రిలీజైతే, ఆ వెంటనే కొత్త సినిమాను పట్టాలెక్కించే ఆలోచన చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్.

error: Content is protected !!