
గుంటూరు కారం నుంచి తప్పుకున్న తర్వాత, పూజా హెగ్డే తెలుగు చిత్రాలేవి కమిట్ కాలేదు. పైగా బుట్టబొమ్మను తెలుగులో దర్శకనిర్మాతలు దూరం పెడుతున్నారు. అందుకే పూజ కోలీవుడ్ పైనే ఫోకస్ పెడుతోంది. రీసెంట్ గా రెట్రో లో కనిపించింది. మరి కొద్ది గంటల్లో కూలీ స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ చేయనుంది. ఇక కాంచన 4, అలాగే విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో ఉన్నాయి.టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చేందుకు, చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ , సరైన ప్రాజెక్ట్ ఖరారు కావడం లేదు. దీంతో బుట్టబొమ్మ్ టాలీవుడ్ రీఎంట్రీ ఆలస్యం అవుతోంది. అయితే ఇప్పుడు పూజా హెగ్డే నటించే తెలుగు చిత్రం లాక్ అయిందని సమాచారం. తెలుగులో దుల్కర్ సల్మాన్ నటించబోతున్న కొత్త చిత్రంలో పూజా హెగ్డేను కథానాయికగా లాక్ చేసారట.
అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ లో పూజా ఫ్యాన్స్ కు పండగే. తెలుగులో దుల్కర్ చిత్రం అంటే అది హిట్టే అనే సెంటిమెంట్ బలపడిపోయింది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలు, ఈ సెంటిమెంట్ లో నిజం అని ప్రూవ్ చేస్తున్నాయి. అలాంటి లక్కీ హీరోతో, అన్ లక్కీ హీరోయిన్ జోడి కడుతోంది. ఒక కొత్త దర్శకుడు వీరి కాంబినేషన్ ను లాక్ చేసాడని సమాచారం. మొత్తానికి పూజా హెగ్డే టాలీవుడ్ కు తిరిగొస్తోంది అనమాట.
ఇది కూడా చదవండి