
మలయాళ సినీ పరిశ్రమ నుంచి సినిమా అంటే, వందో కోట్లు కొల్లగొడితే గొప్ప. అలాంటి ఇండస్ట్రీ నుంచి, ఇఫ్పుడు 300 కోట్ల వసూళ్ల సినిమాలు వస్తున్నాయి. అది ఎంపురాన్ -2తో సాధ్యపడబోతోంది. మార్చి 27న విడుదలైన ఎంపురాన్ -2, ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ముఖ్యంగా మాలీవుడ్ నుంచి రిలీజైన ఫస్ట్ పాన్ ఇండియా, అలాగే ఫస్ట్ పాన్ ఇంటర్నేషనల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అయితే మొదటి వసూళ్లు లెక్కలు చూస్తే, ఈ సినిమా పాన్ ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పవచ్చు.
మొదటి వారంలోనే 230 కోట్ల వసూళ్లను అందుకుని, మలయాళ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీటిల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచే 130 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి అంటే మీరు నమ్మగలరా.. 30 కోట్లు రెస్టాఫ్ ఆఫ్ ఇండియానుంచి వచ్చాయి. ఇక మాలీవుడ్ నుంచి 70 కోట్లు కురిసాయి. ప్రస్తుతం ఈ చిత్రం 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. లూసిఫర్ సీక్వెల్ గా ఉన్న క్రేజ్, పృథ్వీరాజ్ సుకుమార్ మేకింగ్, అందివచ్చిన వివాదాలు ఈ చిత్రం పై కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి