దేశంలో 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తీసుకురావాలంటే 2030 నాటికి అమ్ముడయ్యే వాహనాల్లో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీట్ లో భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. భారత్ లో ఈవీ కార్ల అమ్మకాలు పెరగుతున్నాయని, ఇది మంచి పరిణామం అన్నారు కేంద్ర మంత్రి.ప్రస్తుత అంచనాలు ప్రకారం 2030 నాటికి మొత్తం వాహనాల్లో 35 శాతం ఈవీలే ఉండనున్నాయి అని భూపేందర్ చెప్పుకొచ్చారు. అయితే 2070 నాటికి ఆటోమొబైల్ రంగం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆది 50 శాతం ఉండాలి అన్నారు కేంద్ర పర్యావరణ మంత్రి.

error: Content is protected !!