ఒకప్పుడు వారిద్దరు ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి హిందీ పరిశ్రమ మొత్తం మాట్లాడుకుంది. ఈ దశలో ఇద్దరు కలసి నటించిన ఒక చిత్రం విడుదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని అందుకుంది. ప్రేమకథలో ప్రేమికులు ఇద్దరు నటించడంతో, ప్రేమికులు బ్రహ్మారథం పట్టారు. మళ్లీ కలిస్తే నటిస్తే చూడాలనుకున్నారు. కాని ఆ జంట విడిపోయింది. చెరో దారి చూసుకుంది. మళ్లీ మొహాలు కూడా చూసుకున్నపాపాన పోలేదు.

బాలీవుడ్ కు బ్రేకప్స్ కొత్త కాదు. కాని 2007లో జరిగిన బ్రేకప్ మాత్రం, హిందీ ఇండస్ట్రీ ఇప్పటికీ మర్చిపోలేకపోతుంది. అందుకు కారణం స్టార్ హీరో షాహిద్ కపూర్ , స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, ఇద్దరు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేశారు. 2007లో జబ్ వీ మెట్ అనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీలో నటించేందుకు ముందు, నాలుగేళ్లుగా షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఇద్దరు ప్రేమలో ఉన్నారు. మూడు సినిమాల్లో నటించారు. కాని నాలుగో చిత్రం .. జబ్ వీ మెట్ లో నటించే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ బంధం తెగిపోయింది. కరీనా ఆ పైన ఏడాది తషన్ అనే సినిమాలో నటిస్తూ సహ నటుడు సైఫ్ అలీ ఖాన్ తో ప్రేమలో పడింది. అదే స్పీడ్ లో సైఫ్ తో పెళ్లి పీటలెక్కేసింది. మరో వైపు షాహిద్ కపూర్ కూడా మరో అమ్మాయిని పెళ్లాడాడు.

పేరుకు షాహిద్ కపూర్, కరీనా కపూర్ కాని, జబ్ వి మెట్ మూవీ రిలీజైన తర్వాత వీరి పేర్లు ఆది, గీత్. అంతగా ఈ పాత్రలు పాపులర్ అయ్యాయి. 2007 లో జబ్ వీ మెట్ రిలీజైన తర్వాత, వీరిద్దరు మళ్లీ కలసి కనిపించలేదు. ఒకే స్టేజ్ పై కనిపించినా, ఎప్పుడు పలకరించుకోలేదు. కాని 2025 ఐఫా వేడుకుల్లో మాత్రం వీరిద్దరు ఒకరినొకరు పలకరించుకోవడం, కాసేపు ఛిల్ కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. షాహిద్, కరీనా ఫోటోలు కొద్ది నిముషాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేసాయి. అదిగో గీత్ ను కలుసుకున్న ఆది అంటూ, ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఇదే స్పీడ్ లో వీరిద్దరు కలసి ఒక సినిమా చేస్తే మాత్రం,ట

బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం. జబ్ వి మెట్ సీక్వెల్ అయితే మాత్రం, ఇక ఆ సినిమా క్రేజ్ మరో స్థాయిలో ఉంటుంది.

ఇవి కూడా చవవండి
error: Content is protected !!