
ఎక్కడో ఎవరో హ్యాపీగా ఉన్నారని, మన దేశాన్ని తక్కువ చేయడం కాదు. బట్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా మళ్లీ విడుదలైంది. ఎప్పటిలాగే ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
వరుసగా 8వ సారి ఈ టైటిల్ గెల్చుకుంది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసర్చ్ సెంటర్, ప్రతి ఏటా ఇలా హ్యాపీగా ఉండే కంట్రీస్ లిస్ట్ రిలీజ్ చేస్తు వస్తోంది. దీన్నే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటారు. వరుసగా 8వ సారి ఫిన్లాండ్ హ్యాపీ కంట్రీగా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్, నిలిచాయి. నెదర్లాండ్స్, కోస్టారికా, నార్వె, ఇజ్రాయెల్,లక్సెంబర్గ్, మెక్సికో, టాప్ 10లో చోటు సంపాదించాయి.
హమస్ తో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ, సంతోషకరమైన దేశాల్లో లిస్ట్ లో, ఇజ్రాయెల్ 8వ స్థానంలో నిలవడం, అన్నిటికంటే పెద్ద సంచలనం.
మరి భారత్ స్థానం ఎంతో తెలుసా, ఇందులో కూడా మనం సంతోషపడే ఫలితమే ఉంది. గత ఏడాది మన దేశం సంతోషకరమైన దేశాల్లో 126వ స్థానంలో నిలిచాం. కాని ఏడాది ఆరు స్థానాలు ఎగబాకాం. ఇప్పుడు మనం 118వ ర్యాంక్‌లో ఉన్నాం.
మన పక్క దేశాలు చైనా ఏమో 68వ స్థానం అట. ఇక బద్దశత్రువు పాకిస్థాన్ 109 స్థానాన్ని దక్కించుకుంది. ఈ రిపోర్ట్ లో అందర్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, యూఎస్ స్థానం. ఒకప్పుడు 11వ స్థానంలో నిలిచిన అమెరికా, ఇప్పుడు 24వ స్థానానికి పడిపోయింది. కేవలం చేతిలో డబ్బు, ఎదుగుదల మాత్రమే తీసుకోని, ఈ జాబితాను సిద్ధం చేయరు.
ఏ దేశంలో అయితే ప్రజలు తక్కువగా ఆందోళన ఉంటారో, ఒత్తిడి, అసంతృప్తి దరిచేరనీరో, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారో, అవినీతికి దూరంగా ఉంటారో, మనిషి అంటేనే మంచివాడు అంటారు కదా.. అలాంటి వాళ్లు ఎక్కడ ఉంటారో, ఆ దేశాన్ని మాత్రమే ఇలా నెంబర్ వన్ ర్యాక్యింగ్ ఇస్తారు. పాపం ఈ లిస్ట్ లో లాస్ట్ కంట్రీ ఏదో తెలుసా, తాలబన్ల పాలనలో ఉన్న ఆఫ్గాన్ లు హ్యాపీనెస్ విషయంలో లాస్ట్ లో ఉన్నారు.