తెలుగు తెరపై ఎంతో మంది కథానాయికలు కనిపించి ఉండవచ్చు. కాని లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుని, తెరపై హీరోలకు సరిసమానంగా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ శాంతి క్రేజ్ మాత్రం, మరకొరు అందుకోలేరు. నటనలో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో సెపరేట్ లెవల్ ఉంది. అందుకే ఇన్నేళ్లు అయినా విజయశాంతి నుంచి కొత్త సినిమా అంటే టాలీవుడ్ ఎగ్జైట్ అవుతుంది. రాములమ్మ కొత్త సినిమా అట అని మురిసిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరులో నటించింది విజయశాంతి. ఇప్పుడు మళ్లీ కళ్యాణ్ రామ్ కొత్త చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమాకు మహిళా దినోత్సవం కానుగా టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ ఫోటో విడుదల చేసారు. సినిమా పేరు ఏంటో తెలుసా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అరే ఇది విజయశాంతి నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ కర్తవ్యం మూవీలో పేరు కదా అని గుర్తు చేసుకుంటున్నారు లేడీ అమితాబ్ అభిమానులు. పైగా విజయ శాంతి మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండటంతో, పోస్టర్ లో ఖాకీతో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోహైల్ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో బింబిసార కోసం భారీ బడ్జెట్ పెట్టి కళ్యాణ్ రామ్ తన సినిమాను నిర్మించాడు. తనకు అంత మార్కెట్ లేదని తెల్సినా, కేవలం కథపై ఉన్న నమ్మకం తో సాహసం చేసాడు. బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో యాక్షన్ సీన్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవి కూడా చవవండి

error: Content is protected !!