రెండేళ్ల క్రితం రిలీజైన బ్రో మూవీ తర్వాత, బిగ్ స్క్రీన్ పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించలేదు. చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి కాని, వీరమల్లు రిలీజైతేనే, మిగితా చిత్రాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ చిత్రం గత నాలుగైదు ఏళ్ల నుంచి నిర్మాణంలో ఉంది. చాలా సార్లు విడుదల తేదీలు మార్చుకుంది. నిజానికి జూన్ 12న విడుదల కావాల్సింది. కాని ఇప్పుడు అప్పుడు గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జులై 24న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త.

చాలా కొద్ది మంది స్టార్స్ ను మాత్రమే ప్రేక్షకులు కేవలం తెరపై చూసేందుకు థియేటర్ కు వెళ్తారు. అలాంటి స్టార్స్ లో తిరుగులేని స్టార్, వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన నట జీవితంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ఇది. క్రిష్ కథ చెప్పి, మొదట కొంత భాగాన్ని షూట్ చేసాడు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో, మరో ప్రాజెక్ట్ కు వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఏఎం రత్నం గారి అబ్బాయ్, ఏఎం జ్యోతి కృష్ణ రంగంలోకి దిగాడు. తాను కూడా దర్శకుడు కావడంతో, మిగిలి ఉన్న చిత్రీకరణను పూర్తి చేసి, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

జులై 24 అంటే మెగా ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇదే డేట్ కు పవన్ కల్యాణ్ నటించిన క్లాసిక్ తొలిప్రేమ రిలీజైంది. ఆ తర్వాత మెగాస్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర విడుదలైంది.

ఇది కూడా చదవండి

error: Content is protected !!