
భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించిన కీలకమైన అప్ డేట్ వచ్చింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధం అన్నారు. గతంలో కూడా ఇదే టాపిక్ పై చాలా సార్లు క్లారిటీ ఇచ్చానని, ఇప్పుడూ అదే చెబుతున్నాను అంటూ తాను గీత దాటే వ్యక్తిని కాదని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తానని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని హరీష్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే స్టోరీస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదన్నారు.
ఇంతకీ హరీష్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు ఎక్కడ చేసారు అంటారా.. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ, కేటీఆర్ నాయకుడు అయితే స్వాగతిస్తా…సహకరిస్తా అన్నారు హరీష్. మరో వైపు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేటీఆర్ భారతీయ రాష్ట్ర సమితిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్నారు.