అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదిన కర్మకు, మెగా హీరోలు తరలి రావడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెల్సిందే. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఇలా మెగా హీరోలంతా కనకరత్నమ్మ దశదిన కర్మకు విచ్చేశారు. అల్లు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించారు. నిజానికి మెగా హీరోలందరూ కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. పవన్ తన శాఖల పరంగా, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక చిరు కూడా తన కొత్త చిత్రం మన శంకరవరప్రసాద్ గారు సాంగ్ షూట్ లో ఉన్నాడు. ఇక రామ్ చరణ్ పెద్ది పనుల్లో ఉన్నాడు. అయినప్పటికీ, కొంత సమయం తీసుకుని, కార్యక్రమానికి హాజరయ్యారు. అల్లు కుటుంబానికి దగ్గరిగా కనిపించారు.

ఈ ఫోటోలు చూసిన వారికి, ఇప్పుడు ఒక్కటే సందేహం, మళ్లీ అల్లు, మెగా కుటుంబాలు కలసిపోయాయా… గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో మెగా ఫ్యామిలీకి, అల్లు కుటుంబానికి మధ్య దూరం మరింత పెరిగింది. ఆ తర్వాత మెగా కుటుంబానికి అల్లు అర్జున్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ మెగా , అల్లు ఫ్యాన్స్ కింద విడిపోయారు. ఈ దశలో ఈ రెండు కుటుంబాల స్టేటస్ ఏంటి అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

error: Content is protected !!