
56 రోజులవుతోంది.. ఇంకా మంచానికే పరిమితం అయ్యాడు శ్రీతేజ్.కిమ్స్ వైద్యులు ఇంకా శ్రీతేజ్ కు చికిత్స కొనసాగిస్తున్నారు. కాని ప్రతిస్పందన అయితే లేదు. పేరు పెట్టి పిలిస్తే కళ్లు తెరిచి చూడటం లేదట. నోరు విప్పి మాట్లాడుతున్నది లేదట. ఎంత బాధ, ఎంత క్షోభ, ఇప్పటికీ ముక్కు దగ్గర అమర్చిన సన్నని పైప్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారట. వైదులు ఫిజియో చేపడుతున్నారు. అయినా సరే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదని వైద్యలు చెబుతున్నారు.
శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్ని సక్రమంగానే ఉన్నప్పటికీ, శ్రీతేజ్ నుంచి మాత్రం ఇంకా సాధారణ పరిస్థితుల్లోకి రాలేకపోతున్నాడు. శ్రీతేజ్ ఎప్పటికీ కోలుకుంటాడు అనేది డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. వైద్యం కొనసాగిస్తున్నారు.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 4 రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. రేవతి అక్కడిక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ వయసు 9 ఏళ్లు ఉంటాయి. తీవ్రంగా గాయపట్టాడు. జనం శ్రీతేజ్ మీదుగా వెళ్లడంతో కొంత సమయం పాటు అతనికి ఊపిరి ఆగిపోయింది. వెంటనే పోలీసులు స్పందించి, సీపీఆర్ చేయడంతో తిరిగి శ్వాస అందుకున్నాడు. వెంటనే సికిందరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మొదట కొన్ని రోజులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ ను తొలగించారు వైద్యలు. ప్రస్తుతం ప్రత్యేక గదిలో వైద్యం కొనసాగుతోంది. ప్రభుత్వమే శ్రీతేజ్ చికిత్స అందిస్తూ వస్తోంది.
శ్రీతేజ్ కోలుకోని ఇంటికి తిరిగి రావాలని అతని తండ్రి, చెల్లెలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. శ్రీతేజ్ హెల్త్ గురించి తెల్సిన వాళ్లు అతను త్వరగా కోలుకోని ఇంటికి వెళ్లి, మళ్లీ స్కూల్ కు వెళ్తూ.. గతంలో డ్యాన్స్ వేసినట్లే వేస్తూ హుషారుగా కనిపించాలని, బలంగా కోరుకుంటున్నారు.