
ఈ ఏడాది మార్చి మాములుగా ఉండవచ్చు. రాబిన్ హుడ్, టుక్ టుక్, మ్యాడ్ స్క్వేర్ లాంటి మూవీస్ రిలీజ్ కావచ్చు. కాని నెక్ట్స్ ఇయర్ మార్చి మామూలుగా ఉండదు. ఎందుకంటే వచ్చే మార్చిలోనే రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది రిలీజ్ కానుంది.
అలాగే నాని నటిస్తోన్న ప్యారడైజ్ విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. నిజానికి ముందుగా మార్చి 26న వస్తున్నట్లు నాని ప్రకటించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తన పెద్ది మూవీని మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. రెండు మాస్ మూవీస్.
పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. హీరోల కెరీర్ కు కీలకం. ఈ దశలో చరణ్ చిత్రానికి దారి ఇస్తూ నాని తన సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడని ప్రచారం సాగింది. హిట్ -3 ప్రమోషన్స్ లో ఉన్న నాని, ఈ క్లాష్ గురించి మాట్లాడాడు. పెద్ది కోసం ప్యారడైజ్ ను వెనక్కి నెట్టేది లేదు అన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇంకా చాలా టైమ్ ఉంది. పైగా రెండు ఒకే సారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా రెండు బ్లాక్ బస్టర్ అవుతాయి అంటున్నాడు నేచులర్ స్టార్. మొత్తానికి నెక్ట్స్ మార్చిలో అయితే క్లాష్ కన్ ఫామ్ అనమాట.
అన్నట్లు నాని మూవీని దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెల తెరకెక్కిస్తున్నాడు. ఇక పెద్దిని ఎవరు తెరకెక్కిస్తున్నారో తెల్సుగా..