పహల్గామ్ ఘోరం మీద సినీ స్టార్స్ విచారం జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన, ఉగ్రదాడిలో 28న మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరమైనది. మినీ స్విట్జర్లాండ్ అని పిలవబడే బైసరన్ ప్రాంతానికి అతి కష్టం మీద చేరి, పర్యాటకలు అంతా ఆహ్లాదకరంగా గడుపుతున్న సమయంలో ఉగ్రవాదలు విరుచుకుపడి, ఈ మారణ కాండకు ఒడిగట్టారు. దేశంపై జరిగిన ఉగ్రదాడిని సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఖండించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

కశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రవాదుల ఘాటుకానికి పాల్పడటంతో దేశం ఉలిక్కి పడింది. పర్యాటకులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టనపెట్టుకున్నారు ఉగ్రవాదులు.ఇది క్షమించరాని చర్య అంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కన్నీరు పెట్టుకున్నారు.

బాధితులను చూస్తుంటే తన హృదయం బరువెక్కుతోందని తెలిపారు ఎన్టీఆర్.

పహల్గాం లో జరిగిన దాడి గురించి తెలిసి తన గుండె పగిలిపోయింది అన్నారు అల్లు అర్జున్. బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశాడు.  మృతి చెందిన అమాయికలు ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు.

40ఏళ్లు అయినా కశ్మీర్ కథ మారలేదని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేసారు. హిట్ 3 మూవీ కోసం రెండువందల మందితో అక్కడే షూట్ చేసినట్లు నాని చెప్పాడు.  అలాంటి చోట ఇలాంటి ఉగ్రదాడి జరగడం బాధగా ఉందని , మాటలు రావడం లేదు అన్నాడు నాని.

హీరో విజయ్ దేవరకొండ పహల్గాంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లగా, అదే సమయంలో తన పుట్టినరోజు వేడుకులను కూడా అక్కడి అందమైన ప్రదేశంలో జరుపుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో జరిగిన విషాదం గురించి తెల్సి, తన హృదయం ముక్కలైనట్లు చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇదో భీకరమైన దాడి అని, అమాయికలను చంపడం అత్యంత దారుణం అన్నారు అక్షయ్ కుమార్.

ఇది క్షమించరాని చర్య అని, వారి పై ప్రతీకారం తీర్చుకోని తగు విధంగా బుద్ది  చెప్పాలి అన్నారు సంజయ్ దత్.

సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులు జరపడం అన్యాయం అంటూ బరువెక్కిన హృదయంతో పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్.

ఈ దాడి నుంచి కొందరు సెలబ్రిటీలు త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. హిందీ టీవీ సీరియల్ స్టార్స్, దీపిక కక్కర్, అలాగే షోయబ్ ఇబ్రహీం తమ కుమారుడితో కలసి ఇటీవలే కశ్మీర్ ట్రిప్  కు వెళ్లారు. అయితే దాడి జరగడానికి కొన్ని గంటల ముందే తాము క్షేమంగా ఢిల్లీకి చేరినట్లు ఓ పోస్ట్ ద్వారా వెల్లడించాడు షోయబ్.

error: Content is protected !!