
త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, నిజానికి గౌతమ్ తిన్ననూరితో మూవీ చేయాల్సింది. అందుకు తగ్గ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాని ఎందుకో ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఆ స్థానంలో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ సెట్స్ పైకి వెళ్లింది. దీంతో కింగ్డమ్ రామ్ చరణ్ చేయాల్సిన చిత్రం కదా అంటూ ముందు మెగా ఫ్యాన్స్ లో డౌట్ రైజ్ అయింది. కాని ఈ వార్తల్లో, రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు కింగ్డమ్ నిర్మాత నాగ వంశీ.
రామ్ చరణ్ కు గౌతమ్ చెప్పిన స్టోరీ వేరే కథ అని, కింగ్డమ్ పూర్తిగా విజయ్ దేవరకొండ కోసమే తయారు చేసిన కథ అని క్లారిటీ ఇచ్చాడు నాగవంశీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ అదే చెప్పాడు. గౌతమ్ తనకు రెండు కథలు చెప్పాడని,అందులో ఒక కథతో మరో చిత్రం ఆల్రెడీ తెరకెక్కుతుండటంతో, కింగ్డమ్ కథను తాను ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు విజయ్. జులై 31న కింగ్డమ్ రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ కు కమ్ బ్యాక్ గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి