కుబేర తో టాలీవుడ్ కు ఒక సూపర్ హిట్ మూవీని అందించాడు శేఖర్ కమ్ముల. బైలింగువల్ గా తెరకెక్కినప్పటికీ ఈ చిత్రం తెలుగులోనే వంద కోట్లు రాబట్టింది.ధనుష్ కెరీర్ లో మరో బిగ్ హిట్ గా నిలిచింది. ఇక నాగార్జున కూడా ఈ చిత్రం తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. కుబేర రిలీజైపోయింది. ఇక శేఖర్ కమ్ముల కొత్త చిత్రం పై డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. నిజానికి శేఖర్ కమ్ముల నుంచి కొత్త చిత్రం అంటే అది ఇప్పుడప్పుడే ఉండదని ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. సినిమా మేకింగ్ లో ఈయన జూనియర్ రాజమౌళి లెక్క. మినిమం మూడేళ్లు తీసుకోవాల్సిందే.  కాని ఈసారి మాత్రం శేఖర్ కమ్ముల అంత ఆలస్యం చేయను అంటున్నాడు. ఆల్రెడీ స్టోరీ రెడీగా ఉందట.

నిజానికి  నానితో మూవీ అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని కుబేర ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే స్టోరీ ఇంకా రెడీ కాలేదు. ఈలోపు తన దగ్గర రెడీగా ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. అందుకోసం సమంత డేట్స్ అడుగుతున్నాడని కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.

కుబేర తర్వాత అందమైన ప్రేమ కథ తీస్తానని చెప్పాడు శేఖర్ కమ్ముల. మరి సమంత పేరు ఎందుకు వినిపిస్తోంద అనేది అర్ధం కావడం లేదు. సమంత తో ఏదైనా మంచి ప్రేమ కథ ప్లాన్ చేస్తున్నాడా.. అప్పుడు ఒక స్టార్ హీరో కూడా అవసరం ఉంటాడు. మొత్తంగా శేఖర్ కమ్ముల కొత్త చిత్రం కన్ ఫ్యూన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎప్పుడో మూడేళ్ల తర్వాత వచ్చే చిత్రం, ఇఫ్పటినుంచే హైప్ అంటూ ఈ డైరెక్టర్ స్టైల్ గురించి తెల్సినవారు అంటున్నారు.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి

error: Content is protected !!