
కోలీవుడ్ కు సంబంధించినంతవరకు రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ అనేది బిగ్ న్యూస్. అలాగే పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించడం అంటే చిన్న విషయం కాదు, అందుకే కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి నటించబోతున్నారు అని లీక్ బయటికి రాగానే, సోషల్ మీడియా షేక్ అయింది.
కోలీవుడ్ సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే, ఈ ఇద్దరు లెజెండ్స్ కలసి నటించబోతున్నారు అనేది కేవలం రూమర్ మాత్రమే అట. మరో విషయం ఏంటంటే, ఇది కేవలం ప్రమోషనల్ స్టంట్ అట. కూలీ కలెక్షన్స్ పెంచేందుకు మాత్రమే , దర్శకనిర్మాతలు ఈ క్రేజీ మల్టీస్టారర్ రూమర్ ను బయటికి వదిలారని ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుతుంది. ఆల్రెడీ గతంలో ఒక సారి కలసి నటిస్తామని చెప్పి , మాట తప్పారు రజనీ, కమల్.
ఇఫ్పుడు కూడా అలాగే చేస్తే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. కాని ఎవరైనా ఏం చేస్తారు. కలసి నటిస్తే బాగుండేది కదా అనుకుంటారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటిస్తారు అనేది రూమరే, అలాగే వీరి మల్టీస్టారర్ ఆగిపోయింది అనేది కూడా రూమరే.. ఈ రెండిటిలో ఏది నిజం అవుతుందో, లేక ఈ స్టోరీ ఏ మలుపు తీసుకుంటుంది అనేది మరికొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.
ఇవి కూడా చదవండి
