
ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకు పడుతున్న వేళ, మరో వైపు అమెరికా ఏ నిముషంలో అయినా దాడికి తెగబడనుంది అని సమాచారం అందుతున్న సమయంలో, ఇరాన్ పెంచిపోషించిన ఉగ్ర సంస్థలు… అంటే హమాస్, హెజ్ బొల్లా, హూతీలు ఏమైయ్యాయి..? ఏం చేస్తున్నాయి..? ఎందుకు సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాయి అనేది, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
పాలస్తీనాలో హమాస్,
లెబనాన్ లో హెజ్ బొల్లా,
యెమెన్ లో హూతీలు,
ఇరాక్ లో మరిన్ని సంస్థలు ..
అన్ని కూడా ఇరాన్ నీడలో పెరిగినవే… ఇరాన్ కు అనధికార సైన్యమే.
ఇరాన్ శత్రువుల పై విరుచుకు పడటమే వీరి పని. ఇజ్రాయెల్ – హమస్ యుద్ధం అలాగే ప్రారంభమైంది. ఆ తర్వాత ఇదే యుద్ధం ఇజ్రాయెల్… హెజ్ బొల్లాను తుడిచిపెట్టే వరకు వెళ్లింది. ఇజ్రాయెల్ సైన్యం ధాటికి హమాస్, హెజ్ బొల్లా పీస్ పీస్ అయిపోయాయి. అగ్ర నేత హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ దాడుల్లో హతం కావడం, మరికొందరు కీలకమైన నాయకులను, ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టడం, ఇంకొందరు నాయకులు పారిపోవడంతో..ఇవి బలహీన పడ్డాయి. చెల్లా చెదురయ్యాయి. నాయకుడు లేని సంస్థలు గా మారాయి. అందుకే ఇరాన్ రంగంలోకి దిగి అంతా సెట్ చేయాలి అనుకుంటుండగా, ఇజ్రాయెల్ తో యుద్ధం ముంచుకొచ్చింది.
ఇక హూతీలు, ఇప్పుడు ఎంతో కొంత యాక్టివ్ గా ఉన్నారు. పైకి మాత్రం ఇరాన్ కు మద్దతు అంటున్నారు .. కాని ఇరాన్ అంచనాలు అందుకునే విధంగా రంగంలోకి దిగడం లేదు… ఇలా ఎందుకంటే రెండు నెలల క్రితమే, అమెరికా రంగంలోకి దిగి హూతీలకు చెందిన క్షిపణులను నేల కూల్చింది. దీంతో వారికి కూడా భయం వెంటాడుతోంది. అందుకే యుద్ధక్షేత్రంలో ఇరాన్ కు అనుకూలంగా పోరాడలేకపోతున్నారు. అందుకే ఇరాన్ అనధికార సైన్యం అండలేకుండా ఇజ్రాయెల్ తో ఒంటరిగా పోరాడుతోంది.
ఇవి కూడా చదవండి