ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.ఇదే క్రమంలో ఇరాన్ అధికారిక టీవీ ( IRIB) పై బాంబు దాడి చేసింది ఇజ్రాయెల్,ఈ దాడికి అప్పటికే లైవ్ లో ఉన్న యాంకరమ్మను సైతం భయపెట్టింది. నిముషాల్లో ఈ వీడియో, సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. సెహర్ ఇమామి పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

బాంబు దాడి ధాటికి ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ పేలిపోయింది. లైవ్ లో ఉన్న యాంకర్ ప్రాణభయంతో పరుగు తీసింది. దెబ్బకు లైవ్ ఆగిపోయింది. కాని కొద్ది సేపటికి, సెహర్ టీవీలో వార్తలు చదివేందుకు ముందుకు వచ్చింది. టెహ్రాన్ టీవీ స్డూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అంతకు ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక పంపింది.  ఇప్పటికే పశ్చిమ ఇరాన్ నుంచి టెహ్రాన్ వరకు  చాలా వరకు గగనతరం తమ నియంత్రణలో ఉన్నట్లు ఇజ్రెయెల్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి

ఇది కూడా చదవండి
error: Content is protected !!