శ్రీదేవి భర్త బోనీ కపూర్ గురించి తెల్సిందే. భార్య అంటే ప్రాణం ఈయనకు. అతిలోక సుందరి అకాల మరణం , బోని కుటుంబంలో చాలా విషాదం తీసుకొచ్చింది. అయినా సరే కొండంత బాధను దిగమింగి, సినిమా నిర్మాణాన్ని కొనసాగించారు బోనీ. అలా లాస్ట్ ఇయర్ తాను తీసిన మైదాన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లతో అని ప్రారంభించారు.

అజయ్ దేవగన్ హీరో, కరోనా ఎంట్రీ కి ముందు 70 శాతం షూటింగ్ పూర్తైంది. మిగిలిన 30 శాతం చిత్రీకరణ, అది కూడా ఫుట్ బాల్ మ్యాచుల కోసం ప్లాన్ చేసారు. ఇంతలో కోవిడ్ రావడం, లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడటం, సినిమా చిత్రీకరణలో ఉండటం, రూల్స్ ఫాలో అయ్యేందుకు కోట్లు గుమ్మరించడం, అలా  కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్ మరో వంద కోట్లు పెరిగింది. గత ఏడాది సినిమా విడుదలై ఫ్లాపైంది. ఈ సినిమా నిర్మాత బోనీ కపూర్ కు అపార నష్టం వచ్చింది.

అందుకే ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన అంతా వ్యక్తం చేసాడు. జరిగిపోయింది, నష్టం వచ్చింది. తమ సినిమాకు పని చేసిన నటీనటులు కొంత పారితోషికం తిరిగి ఇచ్చారు. సంతోషం. సినిమా పరాజయానికి ఎవర్ని నిందించలేం అంటూ తన మంచి తనాన్ని చాటుకున్నాడు బోనీ.ఇక బోనీ కపూర్ ఇద్దరు కూతుర్లు, జాన్వీ ,ఖుషి ప్రస్తుతం సినీ రంగంలో హీరోయిన్స్ గా వెలుగుతున్న సంగతి తెలిసిందే

ఇవి కూడా చదవండి

error: Content is protected !!