ప్రైడ్ తెలుగు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్, సినిమా ఏదైనా సరే, జాన్వీ కపూర్ కేవలం గ్లామర్ తో నెట్టుకురావడం పై విమర్శలు మొదలయ్యాయి. దేవర సినిమాలో మొత్తంలో రెండంటే రెండు సీన్స్ కనిపించింది జాన్వీ. ఇక పెర్ఫామెన్స్ కు స్కోప్ ఎక్కడ ఉంటుంది. ఇదే విషయాన్ని కొరటాలను అడిగితే సెకండ్ పార్ట్ లో జాన్వీ నట విశ్వరూపం చూస్తారు అన్నట్లు చెప్పాడు. అది తర్వాత సంగతి, కాని పెద్దిలోనూ జాన్వీ రోల్ కేవలం దేవరకు కొనసాగింపు లాగే ఉందని, కేవలం గ్లామర్ షో మాత్రమే చేస్తోందని జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ గంట గంటకు పెరుగుతున్నాయి.

నిజానికి జాన్వీలో అద్భుతమైన నటి ఉంది. లేకపోతే గుంజన్ సక్సేనా లాంటి చిత్రంలో నటించి మెప్పించడం అసాధ్యం. కాని తనకు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న రోల్ రావడం లేదు అనేది వాస్తవం. పెద్దిలో ఒక సాంగ్ రిలీజ్ తర్వాత ఇలాంటి కామెంట్స్ చాలా తొందరపాటు అవుతుంది. సినిమా రిలీజైన తర్వాత తన రోల్ గురించి ,తాను ఎంచుకునే పాత్రల గురించి మాట్లాడుకుంటే బెటరేమో..

ఇవి కూడా చదవండి

error: Content is protected !!