ప్రైడ్ తెలుగు సినిమా న్యూస్ – ఎక్స్ క్లూజివ్ – రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రం, షూటింగ్ దశకు వచ్చేసింది. నిన్నటి వరకు టెస్ట్ షూట్ హంగామాలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పుడు మార్చి నుంచి షూటింగ్ ఉండే అవకాశం ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈలోపు సినిమాలో నటించే  యాక్టర్స్ అందరికి ట్రైనింగ్ సెషన్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. లేదా ఈపాటికే ఆ సెషన్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఆల్ మోస్ట్ కన్ ఫామ్ అయిపోయినట్లే..ఎందుకంటే ప్రియాంక చోప్రా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వచ్చి, ఇక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసింది అంటే రీజన్ ఏమై ఉంటుంది చెప్పండి.. ఈ సంగతి పక్కన పెడితే , ఈ చిత్రంలో విలన్ ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకంటే మహేష్ కు విలన్ గా నటించేబోయేది, మా పరిశ్రమ వాడు అంటే మా పరిశ్రమ వాడు అంటూ రెండు ఇండస్ట్రీస్ హడావుడి చేస్తున్నాయి. బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం విలన్ గా నటిస్తాడు అంటుంటే, మాలీవుడ్ ఏమో ముందు నుంచి మావాడి పేరు వినిపించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే విలన్ అంటోంది. జాన్ అబ్రహం ఇప్పటికే బాలీవుడ్ లో పాపులర్ విలన్.

షారుఖ్ కమ్ బ్యాక్ మూవీ పఠాన్ లో విలన్ గా నటించాడు. అయితే తనకు బాలీవుడ్ అంటేనే ఇంట్రెస్ట్. సౌత్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లు గతంలో మాట్లాడాడు. ఇప్పుడు జాన్ మారిపోయాడా అనేది డౌట్. ఇక పృథ్వీరాజ్ సంగతి వేరు. చాలా కాలంగా రాజమౌళికి సాన్నిహిత్యంగా మెలుగుతున్నాడు. సలార్ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరి మధ్య బాండింగ్ అందిరికి కనిపించింది. అదే స్పీడ్ లో మహేష్ బాబుకు విలన్ గా మారుతాడా అంటే అది డౌట్ గానే ఉంది. మరో వైపు మాలీవుడ్ మీడియా మాత్రం, మహేష్ బాబు మూవీ కోసం పృథ్వీరాజ్ దాదాపు 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడని, మార్చి నుంచి షూటింగ్ కు అటెన్డ్ అవుతాను అని చెప్పాడని చెబుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు మహేష్ విలన్ ఎవరూ అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.సినిమా షూట్ కు వెళ్లే ముందు మీడియాను పిలిచి సినిమా గురించి, రాజమౌళి అప్ డేట్ ఇస్తాడని ,తెలుగు మీడియా రిపోర్టర్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..ప్లీజ్

error: Content is protected !!