
కేజీయఫ్ దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్ సినిమా, ఈ కాంబినేషన్ కోసం, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు టైగర్ అభిమానులు. వారి కల ఇంత కాలానికి నెరవేరింది. జూనియర్ కెరీర్ మొత్తంలో చేసిన సినిమాలు అన్ని ఒక ఎత్తు. ఈ చిత్రం మరో ఎత్తు. ఎందుకంటే పవర్ ఫుల్ హీరోయిజానికి, బ్రాండ్ అంబాసిడర్ ప్రశాంత్ నీల్. అలాంటి మేకర్ ఇఫ్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమా తీస్తున్నాడు.
ఆ హీరోయిజం ఎలా ఉండబోతోంది.. ? ఆ పాత్ర ఎలా ఉండబోతోంది.. ? ఆ కథ ఎలా ఉండబోతోంది..? ఆ లుక్ ఎలా ఉండబోతోంది ?అనేది ఒక్క ఎన్టీఆర్ అభిమానులకు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లోనూ క్యూరియాసిటీ ఉంది. అందుకే ఇది ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది. తారక్ పై భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నాడు ప్రశాంత్ నీల్. మే 14 వరకు షూటింగ్ జరుగుతుంది. జులై వరకు ఇదే సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ బిజీగా గడపనున్నాడు. ఆ తర్వాత జులై ఎండ్ నుంచి వార్ సీక్వెల్ ప్రమోషన్స్ లో కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ నీల్ సినిమా సెట్ కు తిరిగి వెళ్తాడు.